చెన్నై : తమిళనాడు సినిమా పరిశ్రమ పై బిగ్‌బాస్ బ్యూటీ, ప్రముఖ తమిళ నటి మీరా మిథున్ సంచలన వ్యాఖ్యలు చేసింది. తమిళనాడు పరిశ్రమలోని షెడ్యూల్డు కులానికి చెందిన డైరెక్టర్లు, యాక్టర్లు, ఇతర నటులు అందరూ బయటకు వెళ్ళిపోవాలని షాకింగ్ కామెంట్స్ చేసింది నటి మీరా మిథున్.. వారి కారణంగా పరిశ్రమలో క్వాలీటి సినిమాలు రావడం లేదని మండిపడింది.
వారి పద్ధతి, వ్యవహారాలు అసలు బాగుండవని…వారి వల్ల తమిళనాడు సినిమా పరిశ్రమకు అన్నీ నష్టాలేనని ఫైర్ అయింది. అయితే తాజాగా నటి మీరా మిధున్ వ్యాఖ్యలపై షెడ్యూల్డ్ కులాలు తీవ్ర ఆగ్రహం చేశాయి. ఈ నేపథ్యంలో చెన్నై, కోయంబత్తూరు ,ఈరోడ్, సహా మొత్తం ఏడు జిల్లాలో అమె పై ఫిర్యాదులు చేశారు. నటి మీరా మిథున్ మాట్లాడిన వీడియో అధికారంగా ఏడు సెక్షన్ లతో కేసు నమోదు చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. అటు తమిళనాడు పరిశ్రమలోని షెడ్యూల్డు కులానికి చెందిన వారు కూడా ఆమె పై మండిపడుతున్నారు.