అఖండ : అహం శివం అయం శివం

-

శివ త‌త్వాన్ని ప‌లికించ‌డంలో, ఆ శివేచ్ఛ‌ను వినిపించ‌డంలోనూ బాల‌య్య ఎంతో ప‌రిణితి సాధించారు.అందుకు ఉదాహ‌ర‌ణ‌గా అఖండ నిలిచింది.ఇంకా చెప్పాలంటే..బాల‌య్య కెరియ‌ర్ ను అస్స‌లు ఒక ఊపు ఊపేస్తున్న సినిమా ఏద‌యినా ఉందంటే అది అఖండ అనే నిర్థారించాలి.ఆ సినిమా చేస్తున్న సంచ‌ల‌నం ద‌గ్గ‌ర బాల‌య్య అనే కాదు మొత్తం చిత్ర బృందం ఆనందంలో మునిగి తేలుతోంది.ముఖ్యంగా సంగీతంకు ఎంత పేరు వ‌చ్చిందో చెప్ప‌లేం.థీమ్ సాంగ్ ను ఒక్కొక్క‌రూ ఒక్కో విధంగా త‌మ‌కు తోచిన రీతిలో వాడుకుని అంతులేని ఆనందాల‌ను పొందుతున్నారు. త‌మ అభిమాన హీరోలు న‌టించిన విజువ‌ల్స్ ను యాడ్ చేయ‌డంతో ఎక్క‌డ చూసినా ఇప్పుడు ట్విట‌ర్ లో ఓ మోత మోగిపోతోంది.ద‌టీజ్ బాల‌య్య జై బాల‌య్య…
భం అఖండ
భం అఖండ
యోగ మాయ‌తో
పాత‌రా భూమిపై
ఆది జెండా
అఖండ సినిమా విడుద‌లయి యాభై రోజులు దాటిపోతున్నా ఇంకా క్రేజ్ అయితే అస్స‌లు త‌గ్గ‌లేదు. ఈ సినిమాకు సంబంధించి మ్యూజిక్ డైరెక్ట‌ర్ థ‌మ‌న్ అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. ముఖ్యంగా అఖండ పాత్ర‌లో బాల‌య్య వ‌స్తుండ‌గా వినిపించే నేప‌థ్య సంగీతం, అదేవిధంగా టైటిల్స్ వాడిన నేప‌థ్య సంగీతం సినిమాకే హైలెట్.అందుకే సినిమా విడుద‌లయిన రోజు నుంచి కేవ‌లం బీజియ‌మ్ కోస‌మే చాలా మంది అభిమానులు ప‌ట్టుబ‌ట్టారు.ఎట్ట‌కేల‌కు థ‌మ‌న్ బీజియ‌మ్ విడుద‌ల చేసి సంద‌డి చేశారు. దీంతో నెటిజ‌న్లు ఆ బీజియ‌మ్ కు త‌మ‌కు న‌చ్చిన వీడియోలు యాడ్ చేసి పండుగ చేసుకుంటున్నారు.

అహం శివం అయం శివం అంటూ బాల‌య్య చేసిన హ‌డావుడిని ఎవ్వ‌రూ ఇంకా మ‌రిచిపోక‌మునుపే, ఓటీటీలో అఖండ విడుద‌ల అయి సంద‌డి చేస్తుంది. సినిమాకు మంచి టాక్ రావ‌డంతో పాటు థ‌మ‌న్ మ్యూజిక్ ను ఒక‌టికి రెండు సార్లు వినేందుకు ఇష్ట‌ప‌డుతున్నారు.అస‌లు థ‌మ‌న్ కెరియ‌ర్ లో ఇంత‌వ‌ర‌కూ సాధించ‌ని గెలుపు ఇది. అందుకే బాల‌య్య అభిమానులు అయితే థ‌మన్ పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తుతున్నారు.


కొన్ని హాలీవుడ్ సినిమాల విజువ‌ల్స్ కు కూడా ఈ బీజియ‌మ్ ను యాడ్ చేశారు చూడండి.ఇక్క‌డ దిగువ ఉంది.

థ‌మ‌న్ మ్యూజిక్ అందిస్తే ఎర్త్ క్వేక్ రావ‌డం కాదు ఎర్త్ షేక్ అవుతుంద‌ని మరో నెటిజ‌న్ త‌న‌దైన శైలిలో రాసుకుని,ఈవీడియో రూపొందించాడు. చివ‌ర్లో మామూలుగా లేదు అన్న వ్యాఖ్య కూడా జోడించి థ‌మ‌న్ ను పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తాడు.

ఆఖ‌రుగా..అఖండ సినిమా మ‌రికొన్ని వండ‌ర్స్ చేయ‌డం ఖాయ‌మ‌నే చెప్పాలి.ఎందుకంటే క‌లెక్ష‌న్ల ప‌రంగానే కాదు సినిమా బీజియ‌మ్స్ ప‌రంగా కూడా ఎంతో ఉన్నత స్థాయిలో ఉంది.అందుకే ఈ థీమ్ ను అస్స‌లు వ‌దులుకోవ‌డం లేదు ట్రోల‌ర్స్ మ‌రియు ఇంకొంద‌రు వీడియో ఎడిట‌ర్స్ కూడా! ఎనీవే కంగ్రాట్స్ థ‌మ‌న్.
– దృశ్య క‌థంబం, మ‌న లోకం ప్ర‌త్యేకం

Read more RELATED
Recommended to you

Exit mobile version