ఫొని తుపాను ప్రభావం.. బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న సిక్కోలు ప్రజలు

-

తుపాను ప్రభావంతో తీవ్రంగా గాలులు వీస్తుండటం, భారీ వర్షాలు కురుస్తుండటంతో తీర ప్రాంత ప్రజలు వణికిపోతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అని ప్రాణాలు అర చేతిలో పెట్టుకొని బతుకుతున్నారు.

సిక్కోలు(శ్రీకాకుళం) తీర ప్రాంత ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఫొని తుపాను ఉగ్రరూపం దాల్చింది. మధ్య బంగాళాఖాతంలో ఒడిశా దిశగా ప్రస్తుతం ఇది పయనిస్తోంది. ఈ పెను తుపాను… ఇవాళ మధ్యాహ్నానికి గోపాలపూర్ – చాంద్ బలీ మధ్య తీరం దాటనున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది.

తుపాను ప్రభావంతో తీవ్రంగా గాలులు వీస్తుండటం, భారీ వర్షాలు కురుస్తుండటంతో తీర ప్రాంత ప్రజలు వణికిపోతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అని ప్రాణాలు అర చేతిలో పెట్టుకొని బతుకుతున్నారు.

నిన్న ఉదయం నుంచే ఉత్తరాంధ్రలో తుపాను ప్రభావం అధికంగా ఉంది. ప్రచండమైన గాలలు అక్కడ వీస్తుండటంతో.. శ్రీకాకుళం, విజయనగరం తీర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను అధికారులు నిలిపివేశారు. దీంతో వందలాది గ్రామాలు అంధకారంలో చిక్కుకున్నాయి.

ఇప్పటికే.. శ్రీకాకుళం తీర ప్రాంత ప్రజలను సహాయక శిబిరాలకు తరలించారు. అయితే.. ఈ తుపాను.. ఏపీని దాటి ఒడిశాలో ప్రవేశించినా శ్రీకాకుళం జిల్లాకు ముప్పు ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. పూరీ – చాంద్ బలీ సమీపంలో తీరం దాటే సమయంలో శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయట. దీంతో శ్రీకాకుళం జిల్లా ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version