మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేఖంగా ఉద్యమం చేస్తున్న రైతులు ఆందోళలను విరమించారు. ఢిల్లీ సమీపంలోని సింఘు బార్డర్ లో రైతులు తమ టెంట్లు తీసేసి ఇళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం ఈ శీతాకాాల సమావేశాల్లో మూడు వ్యవసాయ చట్టాలను ర్దు చేయడంతో రైతులు ఉద్యమాన్ని విరమించారు. రైతుల ఇతర డిమాండ్లయిన కనీస మద్దతు ధర చట్టం, రైతులపై కేసులు ఎత్తివేయడంతో పాటు విద్యుత్ చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్లపై కేంద్రం రైతులకు హామీ ఇవ్వడంతో సంయుక్త కిసాన్ మోర్చా రైతుల ఉద్యమానికి తెరదించింది. కనీస మద్దతు ధరపై కేంద్రం కమిటీని నియమించింది.
ఇదిలా ఉంటే రాకేష్ టికాయత్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు ఆందోళనలను విరమించలేదని.. కేవలం వాయిదా మాత్రమే వేశామని వ్యాఖ్యలు చేశారు. ఆందోళనలు ఇంకా ముగియలేదన్నారు. కేవలం విరామం మాత్రమే ఇచ్చామని తెలిపారు.