బాలీవుడ్ నటికి హస్త ప్రయోగం వీడియో.. ఆ పై క్షమాపణ

-

సోషల్ మీడియా వేదికగా మహిళలకు లైంగిక వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. కొందరు ఆకతాయిలు అశ్లీల ఫొటోలు, వీడియోలతో వేధింపులకు గురిచేస్తున్నారు. ముఖ్యంగా సినీ నటులు, సెలబ్రెటీలకు ఈ బెడద మరీ ఎక్కువ అయిపోతున్నది. తాజాగా బాలీవుడ్ నటి, కమేడియన్‌కు ఓ ప్రబుద్ధుడు హస్త ప్రయోగం వీడియోను పంపాడు. సదరు నటి పోలీసులను ఆశ్రయించడంతో క్షమాపణలు చెప్పాడు.

ఓ వ్యక్తి హస్తం ప్రయోగం చేస్తూ వీడియో చిత్రీకరించాడు. ఆ వీడియోను బాలీవుడ్ నటి కమేడియన్ ఆంచల్ అగర్వాల్‌కు పంపాడు. ఆ వీడియో చూసి తీవ్ర ఆగ్రహానికి గురైన ఆంచల్ అగర్వాల్ యథావిధిగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆమె ఫాలోవర్ ఒకరు ఆ వీడియోను సైబర్ సెల్‌కు పంపించాడు. విషయం తెలుసుకున్న ఆ వ్యక్తి వెంటనే క్షమాపణలు చెప్పాడు. కానీ, చిత్రీకరించి పంపాలని ఆంచల్ అగర్వాల్ సూచించారు. ఆ వ్యక్తి మాస్క్ ధరించి, క్షమాపణలు చెబుతున్న వీడియోను పంపించాడు. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్ ఖాతాలో తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version