రైతుల ఆందోళన @ 14వ రోజు

-

ఢిల్లీ: వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని అన్నదాతలు ఢిల్లీలో ఆందోళన ప్రారంభించి 14వ రోజుకు చేరింది. చలిని సైతం లెక్కచేయకుండా ఢిల్లీ- హరియాణా సరిహద్దుల్లోని సింఘు, టిక్రీ రహదారులపై వేలాది మంది రైతులు తమ నిరసనను తెలుపుతూనే ఉన్నారు. మంగళవారం దేశవ్యాప్తంగా భారత్ బంద్ ప్రశాంతంగా ముగిసింది. చర్చలు కొనసాగుతున్న రైతులు తమ ఆందోళనను విరమించుకోవడం లేదు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో జరిపిన చర్చలు మరోమారు విఫలమయ్యాయి. దీంతో నేడు రైతు సంఘాల నాయకులు మరోసారి సమావేశమై తదుపరి కార్యచరణపై నిర్ణయం తీసుకోనున్నారు.

Farmers protest

నేడు మధ్యాహ్నం 12 గంటలకు రైతు సంఘాల నాయకులు సమావేశం కానున్నారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు నిన్న తలపెట్టిన భారత్ బంద్ ప్రశాంతంగా ముగిసింది. దేశవ్యాప్తంగా 21 రాజకీయ పార్టీలు మద్దుతు తెలిపాయి. కార్మిక, ఉద్యోగ సంఘాలు మద్దతు తెలుపుతూ రోడ్లపైకి వచ్చారు. వ్యాపార, వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా మూతబడ్డాయి. భారత్ బంద్ నేపథ్యంలో మంగళవారం రాత్రి హోంమంత్రి అమిత్ షా అనూహ్యంగా రైతు నాయకులతో చర్చలు జరిపారు. ఈ సమావేశంలో రైతులు డిమాండ్ చేస్తున్నట్లుగా చట్టాలను రద్దు చేయడం సాధ్యం కాదన్నారు. అయితే కొన్ని సవరణలు చేపట్టేందుకు మాత్రం సిద్ధంగా ఉన్నామని అమిత్ షా పేర్కొన్నారు.

బంద్ నిర్వహించకపోతే నిజానికి కేంద్ర ప్రభుత్వం.. రైతు సంఘ నాయకులతో నేడు చర్చలు జరపాల్సి ఉండేది. బంద్ కారణంగా ఒక రోజు ముందుగానే అమిత్ షా రైతు సంఘ నాయకులతో సమావేశం అయ్యారు. కానీ, ఈ సారి కూడా రైతులకు నిరాశే మిగిలింది. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ప్రతిపాదనలను అంగీకరించలేదు. దీంతో నేడు జరగాల్సిన చర్చలను రద్దు చేశారు. సవరణలకు సంబంధించిన అంశాలను బుధవారం లిఖితపూర్వకంగా అందజేయాలని అమిత్ షా సూచించారు.

రైతు సంఘ నాయకులు సవరణ జాబితాను కేంద్రానికి అందించిన తర్వాత 40 రైతు సంఘాల ప్రతినిధులతో భేటీ కానున్నారు. నూతన వ్యవసాయ చట్టాల్లో ఐదు సవరణలకు కేంద్రం సుముఖత చూపింది. ఏపీఎంసీలను బంద్ చేయబోమని, వ్యాపార ఒప్పందాలపై సవరణ, విద్యుత్ చట్ట సవరణ, పంజాబ్ లో పంట కోతల తర్వాత వెలువడే వ్యర్థల దహన సమస్యపై పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు అమిషా పేర్కొన్నారని, వీటిపై రైతులు సుముఖత చేపడం లేనట్లు తెలుస్తోంది. చట్టాలను పూర్తిగా రద్దు చేయాలనే డిమాండ్ కు కట్టుబడి ఉంటారని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version