ఈనెల 29వ తేదీన పదిహేను లక్షల మందితో టిఆర్ఎస్ విజయ గర్జన సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే విజయ గర్జన సభ నిర్వహణకు వరంగల్ నగరంలోని దేవన్నపేట రైతులు బాసటగా నిలిచారు. ఈ సభ నిర్వహణ కోసం ఏకంగా 130 ఎకరాలు ఇచ్చేందుకు రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు.
తమ భూములను తాత్కాలికంగా వినియోగించుకునేందుకు వీలుగా సదరు రైతులు స్థానిక ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కు అంగీకార పత్రాలు అందజేశారు. దీంతో సభ నిర్వహణకు అనుగుణంగా ట్రాక్టర్లు, జెసిబి లతో భూమి చదును చేసే పనులు మొదలు పెట్టారు. బహిరంగ సభ, వేదిక, పార్కింగ్ ఇతర వస్తువుల కు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు టిఆర్ఎస్ నాయకులు. కాగా 4 రోజుల క్రితం… ఇక్కడి రైతులు తమ భూములు ఇవ్వబోమని టీఆర్ఎస్ నేతల పై మండిపడ్డ సంగతి విదితమే. తమ వ్యవసాయ పొలాలను సభ కోసం నిర్వహిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు రైతులు. అయితే తాజాగా ఈ విషయంపై చల్లబడ్డ రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు.