మహారాష్ట్రలోని కినిలో నిర్వహించిన ఓ సమావేశంలో పాల్గొన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలోని రైతులంతా సంతోషంగా ఉన్నారని.. రైతులకు అన్ని రకాల సౌకర్యాలను తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తుంది అన్నారు. మహారాష్ట్రలో రైతులకు కేవలం 6 గంటల కరెంటు మాత్రమే ఇస్తున్నారని పేర్కొన్నారు. కానీ తెలంగాణలో 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తున్న ఘనత మన ప్రభుత్వాన్ని దేనన్నారు. తెలంగాణలో విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు ఇంద్రకరణ్ రెడ్డి.
గుంట భూమి ఉన్నా.. రైతు ఎలా చనిపోయిన వాళ్ళ కుటుంబానికి 8 రోజులలోనే ఐదు లక్షల చెక్ అందిస్తున్నామన్నారు. మరో పది రోజుల్లో నాందేడ్ జిల్లాకు సీఎం కేసీఆర్ రాబోతున్నారని తెలిపారు. ప్రస్తుతానికి ఎన్నికలు లేవు.. మిమ్మల్ని ఓటు అడగడానికి రాలేదు అన్నారు. ఓటు అడిగే విషయం ఎన్నికల నాటికి చూద్దాం కానీ.. మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. కెసిఆర్ వచ్చి చెప్పాక వారు చెప్పింది నిజమా అబద్దమా అని చర్చలు జరిపి ఆలోచన చేయాలని కోరారు.