రైతు బంధు న‌గదు జ‌మ అయిందో, లేదో ఇలా చెక్ చేసుకోండి..!

-

తెలంగాణ రాష్ట్రంలోని రైతుల‌కు పంట పెట్టుబడి స‌హాయం అందించేందుకు గాను రాష్ట్ర ప్ర‌భుత్వం రైతు బంధు ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టిన సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా మొద‌ట్లో ఎక‌రానికి రూ.4వేల చొప్పున ఏడాదికి రెండు సార్లు రైతుల బ్యాంకు అకౌంట్ల‌లో జ‌మ చేశారు. అయితే ప్ర‌స్తుతం ఆ స‌హాయాన్ని పెంచారు. ఇప్పుడు రూ.5వేల చొప్పున రైతుల అకౌంట్ల‌లో న‌గ‌దు జ‌మ అవుతోంది.

ఇక ప్ర‌భుత్వం రైతు బంధు న‌గ‌దును క్ర‌మం త‌ప్ప‌కుండా రైతుల అకౌంట్ల‌లో జ‌మ చేస్తోంది. కానీ కొంద‌రికి మాత్రం త‌మ అకౌంట్ల‌లో న‌గ‌దు జ‌మ అయిందీ, కానిదీ తెలియ‌డం లేదు. అయితే అలాంటి వారు https://treasury.telangana.gov.in/index1.php?service=allschemes అనే లింక్‌ను ఓపెన్ చేసి అందులో వివ‌రాలు న‌మోదు చేస్తే.. రైతులు త‌మ అకౌంట్ల‌లో న‌గ‌దు జ‌మ అయిందీ, కానిదీ ఇట్టే సుల‌భంగా తెలుసుకోవ‌చ్చు. న‌గ‌దు జ‌మ అయితే దాన్ని వెంట‌నే విత్ డ్రా చేసుకోవ‌చ్చు.

ఇక ఈ సైట్‌లో కేవ‌లం రైతు బంధు న‌గదు వివ‌రాల‌ను మాత్ర‌మే కాకుండా ప‌లు ఇత‌ర వివ‌రాల‌ను కూడా తెలుసుకోవ‌చ్చు. ఉద్యోగులైతే జీతాలు ప‌డిందీ, లేనిదీ.. ఇత‌రులు అయితే పెన్ష‌న్లు, క‌ల్యాణ ల‌క్ష్మి వివ‌రాలు, స్కాల‌ర్ షిప్పులు, బ‌డ్జెట్ వివ‌రాల‌ను తెలుసుకోవ‌చ్చు. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం రాష్ట్రంలోని లబ్ధిదారుల‌కు అందే ఫ‌లాలు వారికి అందుతున్నాయా, లేదా అనే వివ‌రాల‌ను వారికి వారే చెక్ చేసుకునేందుకు గాను ఈ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version