ఢిల్లీలో రైతుల ఆందోళన కొనసాగుతోంది. నేడు 8వ విడత చర్చలు జరగనున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు విజ్ఞాన్ భవన్ లో 40 రైతు సంఘాల నేతలతో ప్రభుత్వం చర్చలు జరపనుంది. చట్టాల ఉపసంహరణ మినహా, ఏ ఇతర ప్రతిపాదనలైనా ప్రభుత్వం పరిశీలించేందుకు సిధ్దం కేంద్ర వ్యవసాయ మంత్రి తోమర్ చెబుతున్నారు. కానీ చర్చలు విఫలమైతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని రైతు సంఘాలు చెబుతున్నాయి.
నేటి చర్చల ఫలితాలను ముందుగా చెప్పలేనన్న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రతిష్ఠంభనను తొలగించేందుకు మత గురువులకు ఏలాంటి ప్రతిపాదనలు ఇవ్వలేదని తోమర్ స్పష్టం చేశారు. రైతు సంఘాల నేతలకు ఎలాంటి ముందస్తు ప్రతిపాదనలు ప్రభుత్వం ఇవ్వలేదన్నారు తోమర్. ఇక మూడు చట్టాల ద్వారా వ్యవసాయ రంగంలో తేనున్న సంస్కరణలు కేవలం ప్రారంభం మాత్రమేనన్న కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాష్ చౌధురి, రానున్న రోజుల్లో “క్రిమి సంహారణ మందుల బిల్లు”, “ విత్తనం బిల్లు” లను కూడా తేనున్నామని చెప్పారు.