సిరిసిల్లలో రైతులు మరోసారి ఆందోళన బాట పట్టారు. పదిమందికి అన్నం పెట్టే రైతుల వడ్లు కొనకుంటే మీరెందుకు మీ ప్రభుత్వం ఎందుకు? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. తాము పండించిన వడ్లు కొనకుంటే రోడ్డు మీదే టెంట్లు వేసి కూర్చుంటామని ఆందోళన తెలిపారు.
సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని ఐకేపీ సెంటర్లో వడ్లను కొనాలని రైతన్నల ఆందోళనకు దిగారు. 10 మందికి అన్నం పెట్టే రైతుల వడ్లు కొనకుండా ఈ ప్రభుత్వం మోసం చేస్తుందని, రోడ్డు మీద వరి బస్తాలను వేసి అన్నదాతలు నిరసన తెలిపారు.వెంటనే ప్రభుత్వం తాము పండించిన వడ్లను కొనుగోలు చేయాలని లేదంటే ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.