అన్నదాతలకు కేంద్రం అందిస్తున్న ఈ 4 స్కీమ్స్ ని మీరు విన్నారా..? పూర్తి వివరాలివే..!

-

కేంద్రం చాలా రకాల స్కీమ్స్ ని ప్రవేశ పెట్టింది. రైతుల కోసం కూడా కేంద్రం వివిధ రకాల స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. ఈ స్కీమ్స్ వలన చాలా మంది రైతులకి చక్కటి లాభాలు అందుతున్నాయి. ముఖ్యంగా అన్నదాతలకు కేంద్రం అందిస్తున్న ఈ 4 స్కీమ్స్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే. పీఎం కిసాన్ మొదలు చాలా స్కీమ్స్ ని తీసుకు వచ్చింది కేంద్రం. వీటిల్లో చేరడం వల్ల అన్నదాతలకు లాభాలే.

కిసాన్ క్రెడిట్ కార్డు స్కీమ్:

కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం కిసాన్ క్రెడిట్ కార్డు స్కీమ్ ని తీసుకు వచ్చింది. 2020లో కొత్త కిసాన్ క్రెడిట్ కార్డు స్కీమ్‌ను తెచ్చింది కేంద్రం. ఈజీగా లోన్స్ ని ఈ స్కీమ్ కింద పొందొచ్చు. ఏటీఎం రూపే కార్డు ని కూడా ఈ స్కీమ్ లో చేరితే అందిస్తున్నారు.
క్రెడిట్ లిమిట్ కూడా లభిస్తుంది. ఈ స్కీమ్ ని కమర్షియల్ బ్యాంకులు, ఆర్ఆర్‌బీలు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకులు అందిస్తున్నాయి.

ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన:

ఈ పథకం ద్వారా కూడా చాలా మంది రైతులు లాభాలను పొందుతున్నారు. 2016 నుంచే ఈ స్కీమ్ అందుబాటులో వుంది. పర్యావరణం కారణంగా పంట నష్టం సంభవిస్తే నష్ట పరిహారం లభిస్తుంది.

ప్రధాన్ మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన స్కీమ్:

ఈ స్కీమ్ కూడా రైతులకి బాగా ఉపయోగ పడుతోంది. ఇది పెన్షన్ స్కీమ్. 18 నుంచి 40 ఏళ్ల వయసులో ఉన్న వాళ్ళు దీనికి అర్హులు. రూ.55 నుంచి రూ. 200 వరకు ఈ స్కీమ్ లో చెల్లించాల్సి వుంది. ఈ పధకం ద్వారా రూ. 3 వేల వరకు పెన్షన్ పొందొచ్చు.

ప్రధాన్ మంత్రి కృషి సించాయీ యోజన:

ఈ పధకం ద్వారా కూడా చాలా మంది రైతులు ప్రయోజనాన్ని పొందుతున్నారు. 2015లో ఈ పథకం అందుబాటులోకి వచ్చింది. వ్యవసాయ భూమిని పెంచాలనే లక్ష్యంతో దీన్ని తీసుకు రావడం జరిగింది. నీటీ పారుదలకు ప్రాధాన్యం ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version