ఫార్మాసిటికీ వ్యతిరేకంగా మళ్లీ కదం తొక్కిన రైతులు

-

రాష్ట్రంలో రైతులు ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. రేవంత్ సర్కార్ ఫార్మాసిటీ పేరిట రైతుల భూములు లాక్కోవాలని చూస్తున్నదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మా భూములు మాకే కావాలి.. ఫార్మా సిటీకి భూములు ఇవ్వబోమని కలెక్టరేట్ ఎదుట రైతులు ధర్నాకు దిగారు.

రంగారెడ్డి జిల్లా కలక్టరేట్ ఎదురుగా ఫార్మాసిటికీ వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ధర్నా ఉద్రిక్తతంగా మారింది. తమ భూములను తిరిగి ధరణిలో ఎక్కించాలని వారు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ వస్తే మంచి జరుగుతుంది అనుకున్నాము. తమ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డికి చెప్తే అట్లనే ఉంటది చట్టం. భూములు ఇవ్వాల్సిందే అని అంటున్నాడని.. ఇక జన్మలో వానికి ఓట్లు వెయ్యము అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news