ఆర్టికల్ 370పై జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు…

-

జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా మరోసారి సంచన వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370, 35ఏ ఆర్టికల్స్ ను , జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదాపై వ్యాఖ్యలు చేశారు. ఆయన కేంద్రం లాగుకున్న మన హక్కులను పొందడానికి త్యాగం చేయాల్సి ఉంటుందని అన్నారు. ఏడాది పాటు రైతులు నిరసన, ఉద్యమం, 700 మంది రైతులు మరణిస్తేనే కేంద్ర వెనక్కి తగ్గి మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకున్నారని.. కాశ్మీర్ ప్రజలు కూడా రైతుల వలే మనం కూడా త్యాగాలకు సిద్ధం కావాలంటూ పిలుపునిచ్చారు. శ్రీనగర్‌లోని హజ్రత్‌బాల్ ప్రాంతంలో పార్టీ వ్యవస్థాపకుడు షేక్ ముహమ్మద్ అబ్దుల్లా 116వ జయంతి సందర్భంగా వద్ద ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు.

జమ్మూ కాశ్మీర్ లో ఇటీవల హైదర్ పోరా లో జరిగిన ఎన్ కౌంటర్లో ముగ్గురు చనిపోయిన తర్వాత.. వారి కుటుంబాల చేసిన పోరాటం వల్లే ఇద్దరి డెడ్ బాడీలను తిరగి ఇచ్చారని గుర్తు చేశారు. ప్రజల ఐక్యత వల్లే ఇది సాధ్యం అయిందన్నారు. మరణించిన మూడో వ్యక్తి మృతదేహాన్ని కూడా వారి కుటుంబాలకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ప్రజలు తమ గొంతుకలను వినిపిస్తేనే హక్కులు సాధించుకుంటామని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version