స్పీడ్ వాకింగ్… స్లో వాకింగ్‌లో ఏది బెట‌రో..

-

సాధార‌ణంగా మార్నింగ్ వాకింగ్ చాలా మందికి ఉన్న అల‌వాటు. నడవడం ఒక మంచి వ్యాయామం. దీని వల్ల‌ చాలా ఆరోగ్యకరమైన ఉపయోగాలున్నాయి. ఉదయాన్నే నిద్ర లేవడంతో దిన చర్య ప్రారంభించి పరగడుపున రెండు గ్లాసుల మంచి నీరు తాగి, కొద్ది సేపటి తరువాత కనీసం అరగంట సేపు న‌డ‌వాలి.

అయితే ఫాస్ట్‌గా న‌డిస్తే మంచిదా లేదా స్లోగా న‌డిస్తే మంచిదా అన్న ప్ర‌శ్న చాలా మందిలో ఉంటుంది. సాధార‌ణంగా మనం రోజూ నడిచేలా స్లో వాకింగ్ చేయ‌డం వ‌ల్ల శరీరంలో కొవ్వు కరుగుతుందే తప్ప  అద్భుతమైన ప్రయోజనాలేవీ కనిపించవు.

స్లో వాకింగ్ వ‌ల్ల శ‌రీరానికి ఉల్లాసంగా అనిపించినా దాని ప్రభావం బాడీలోని ఇంటర్నల్ పార్ట్స్‌పై పడే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కానీ వేగంగా న‌డవ‌డం వ‌ల్ల గుండె ప‌నితీరు స‌క్ర‌మంగా ఉంటుంద‌ని ఓ ఆధ్య‌య‌నంలో తేలింది. శ్వాస వేగాన్ని పెంచే వ్యాయామాలే గుండెను,ఇతర అవయవాలను ఉత్తేజపరుస్తాయని బ్రిటిష్‌ అధ్యయనకారులు ఇటీవలి వెల్ల‌డించారు. ఫాస్ట్ వాకింగ్ వ‌ల్ల  కాన్సర్, మధుమేహం, గుండె జబ్బులు, శ్వాసకోస స‌మ‌స్యలు, మానసిక ఒత్తిడి మరియు డిప్రెషన్ వంటివి రాకుండా నివారిస్తుంద‌ని తెలిపారు.

అలాగే స్లో వాకర్స్‌ లైఫ్ స్పాన్ 72 ఏళ్ళకు మించడం లేదని పరిశోధకులు వివరించారు. మ‌రియు ఫాస్ట్‌గా నడిచే వారి లైఫ్ స్పాన్ మాత్రం 87 ఏళ్ల దాకా ఉంటోందని వారు వెల్ల‌డించారు. ఈ క్ర‌మంలోనే త‌క్కువ‌గా న‌డిచే వారి జీవిత కాలంలో ఫాస్ట్ వాక‌ర్స్‌తో పోలిస్తే త‌గ్గిపోతుంద‌ని ప‌రిశోధ‌కులు స్ప‌ష్టం చేశారు. ఫాస్ట్‌గా న‌డ‌వ‌డం వ‌ల్ల మనిషి జీవిత కాలాన్ని పెంచ‌డ‌మే కాక ఎముకలు బలంగా, మతిమరుపు వంటి స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయ‌ని పరిశోధనలు తెలియజేశాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version