మేడ్చల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి దుర్మరణం

-

మేడ్చల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి చెందినట్లు స్థానికులు వెల్లడించారు. మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని చెక్ పోస్ట్ నుంచి కిష్టాపూర్ వెళ్లే దారిలో ఏక్ మినార్ మసీదు వద్ద గుర్తుతెలియని వాహనం యువకుడిని ఢీ కొట్టింది.

దీంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని కిష్టాపూర్ వాసి కృష్ణ (19)గా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు మేడ్చల్ పోలీసులు తెలిపారు. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.

Read more RELATED
Recommended to you

Latest news