చిన్నపిల్లలని పెంచడమనేది చిన్న విషయం కాదు. తల్లిగా, తండ్రిగా బాధ్యతలు తీసుకుంటూ అనుక్షణం పిల్లల సంరక్షణలో గడపడం అంత తేలిక కాదు. అందుకే పెళ్ళి చేసుకున్నాక పెరిగే బాధ్యతలు పేరెంట్స్ అయ్యాక మరింతగా పెరుగుతాయి. ఆ బాధ్యతలని పట్టించుకోలేని వారు సరైన తల్లిదండ్రులు కాకుండా పోతారు. ఐతే గత కొన్ని రోజులుగా ఆన్ లైన్లో వైరల్ అవుతున్న చిన్నపిల్లల వీడియోలు చూస్తుంటే ఆశ్చర్యం కలగక మానదు. మొన్నటికి మొన్న ఫ్రిజ్ మీద ఉన్న చాక్లెట్ కోసం దానిపైకి ఎక్కిన పిల్లాడి వీడియో చూసాం.
అయితే కొంతమంది పిల్లలకి పోషకాహారం సరిగ్గా అందదు. ఏదైనా సరే నోటిదాకా తీసుకువస్తే తప్పుకుంటారు. అలాంటి వారిని తమ దారిలోకి తెచ్చుకుని సరైన ఆహారాన్ని అందించి పోషాకాహార లోపం నుండి బయటపడేసే టెక్నిక్స్ కూడా తల్లిదండ్రులు నేర్చుకున్నారు. అలాంటి ఒక టెక్నిక్ గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. మ్యూజిక్ ఆల్బమ్స్ చేసే రూడీ విల్లింగ్ హామ్ షేర్ చేసిన ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది. సరైన ఆహారం లేకపోవడం వల్ల కూతురు ఇబ్బంది పడుతుందని, కావాల్సినన్ని పాలు తాగించి ఆమెని ఆ సమస్య నుండి బయటపడేయాలనుకున్న తండ్రి సరికొత్త టెక్నిక్ తో వచ్చాడు.
చిన్నపిల్లలకి పాలు పట్టే గ్లాసుని తీసుకుని ఒక పొడవాటి పైపు చివరన నిపిల్ ఉంచి ఇటు చివర పైపుకు గరాటుని తగిలించి అందులో పాలు పోసి, నిపిల్ ద్వారా పాలు తాగిస్తున్నాడు. నిపిల్ వద్ద చిన్న ట్యాప్ కూడా ఉంది. పాపకి తెలియకుండానే ఆ పాలు నోట్లోకి వెళ్ళిపోతున్నాయి. ఈ సరికొత్త టెక్నిక్ వల్ల ఆ పాపకి పాలు తాగుగున్న ఫీలింగ్ రాకపోయినా పోషకాలన్నీ అందుతున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.