ఏపీలో దారుణం…14ఏళ్ల కుతురు పై తండ్రి అత్యాచారం..!

-

ఏపీలో మరో దారుణం చోటుచేసుకుంది. తన కూతురిపై తండ్రి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా రేణిగుంట లో చోటుచేసుకుంది. రేణిగుంట కు చెందిన ఓ వ్యక్తి తన పద్నాలుగేళ్ల కూతురును అక్టోబర్ 24 న ఇంటి నుండి బయటకు తీసుకు వెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డాడు. అనంతరం ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని తండ్రి బెదిరింపులకు పాల్పడ్డాడు.

child rape cases

అయితే బాధితురాలు తనపై జరిగిన దారుణాన్ని తల్లికి చెప్పడంతో అసలు విషయం బయటపడింది. తల్లి కూతురు ని తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్ వెళ్లి తన భర్త పై ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి దారుణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రీసెంట్గా తెలంగాణ లో అధికారపార్టీ సర్పంచ్ భర్త ఓ బాలిక పై లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. దాంతో అతడిపై కేసు నమోదు చేసి ఫోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. అంతేకాకుండా అతని పార్టీ కూడా సస్పెండ్ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version