హుజూరాబాద్ బైపోల్ కౌంటింగ్: భారీగా పోలీస్ పహారా… మూడంచెల భద్రత

-

రాష్ట్ర వ్యాప్తంగా హుజూరాబాద్ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠతను రేపాయి. నేడు ఓట్ల లెక్కింపు ఉండటంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే అంతటి ప్రతిష్టాత్మకం ఎన్నికలు కావడంతోె భద్రత కూడా ఆ రేంజ్ లో ఉంది. కరీంనగర్ ఎస్ ఆర్ ఆర్ కాలేజీలో ఈవీఎంలు భద్రపరిచారు. అక్కడే ఓట్ల లెక్కింపు జరగబోతోంది. మొత్తం 22 రౌండ్లలో ఓట్లను లెక్కించన్నారు. అయితే ఓట్లను లెక్కించే ఎస్ ఆర్ ఆర్ కాలేజీ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనకు చోటు చేసుకోకుండా ముందస్తుగా భద్రతను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ విధించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. 650 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. 30 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రంలోకి వెళ్లే ముందు సిబ్బందిని పక్కాగా తనిఖీలు చేసిన తర్వాతే పంపించనున్నారు. ఎన్నికల సంఘం ఇచ్చిన పాసులు ఉన్నవారినే లోపలికి అనుమతించనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version