బద్వేల్ బైపొల్..మధ్యాహ్నం లోగా ఫలితాలు….!

-

బద్వేల్ లో ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. కాగా ఈరోజు బద్వేల్ బైపోల్ కు సంబంధించి ఫలితాలు విడుదల కానున్నాయి. బద్వేల్ లోని బాలయోగి గురుకుల పాఠశాలలో ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 8 గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. నాలుగు హాల్స్ లో 28 టేబుల్ల పై కౌంటింగ్ జరగనుంది. 12 రౌండ్లలో ఓట్ల లెక్కింపు ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా మధ్యాహ్నానికి ఎన్నికల ఫలితాలు విడుదల అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే అధికార పార్టీ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మరణంతో ఉప ఎన్నికలు వచ్చిన సంగతి తెలిసిందే. దాంతో అధికార వైసిపి సుబ్బయ్య భార్యకు దాసరి సుధకి టికెట్ ఇచ్చింది. వైసిపి ఎమ్మెల్యే భార్య కి టికెట్ ఇవ్వడం తో టిడిపి, జనసేన పోటీ నుండి తప్పుకున్నాయి. కానీ ఈ ఎన్నికల్లో బిజెపి పోటీ చేసింది. దాంతో వైసీపీ బీజేపీ మధ్య ఏర్పడింది. ఇక మధ్యాహ్నం వరకు బద్వేల్ బాధ్ షా ఎవరు అన్నది తేలే అవకాశం ఉంది. ఈ ఫలితాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version