వర్షకాలం వచ్చిదంటే చాలు సీజనల్ వ్యాధులు ప్రబలుతూనే ఉంటాయి. అయితే.. ఓ వైపు కరోనా కేసులు ఎక్కువవుతుండగా, వాతవరణ మార్పులతో డెంగ్యూ.. మలేరియా, వైరల్ ఫీవర్లతో దవాఖాన్ల బాట పడుతున్నారు ప్రజలు. వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలుతున్నాయి. నీళ్లు నిలిచిపోవడం, డ్రైనేజీలు, చెత్తచెదారం, ఇతర వ్యర్థాలు నీళ్లలో కలవడం, దోమలు, కంపు, కలుషిత వాతావరణంతో వేల మంది విష జ్వరాల బారినపడ్తున్నారు. సర్ది, దగ్గు, డయేరియా వంటివి చుట్టుముడ్తున్నాయి.
గడిచిన వారం రోజుల్లోనే 42,265 ఫీవర్ కేసులు నమోదయ్యాయి. 13 వేలకు పైగా డెంగీ సస్పెక్టెడ్ కేసులు నమోదైనట్టు ఆరోగ్యశాఖ లెక్కలు చెప్తున్నాయి. డెంగీ కేసులు పెరిగే ప్రమాదముందని ఆరోగ్యశాఖ ముందే హెచ్చరించినా, దోమల నివారణకు మున్సిపల్, పంచాయతీరాజ్ డిపార్ట్‌మెంట్లు పెద్దగా చర్యలు చేపట్టలేదు. వ్యాధుల కట్టడి, సత్వర చికిత్స కోసం గ్రామస్థాయి నుంచి హైదరాబాద్ వరకూ ‘డిసీజ్ కంట్రోల్కమిటీ’లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ఆరోగ్యశాఖ. రోగాలు ప్రబలుతున్న ప్రాంతాల్లో పర్యటించి, ఫీవర్ సర్వేలు నిర్వహించనున్నారు ఆరోగ్యశాఖ అధికారులు. ఆ తర్వాత ర్యాపిడ్డయాగ్నస్టిక్టెస్టు(ఆర్డీఎస్) కిట్లను అందుబాటులో ఉంచుతారు ఆరోగ్యశాఖ అధికారులు.