చంద్రబాబు అరెస్ట్ పై సినీ నటుడు సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు

-

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. గత కొద్ది రోజుల నుంచి రాజమండ్రి సెంట్రల్  జైలులో ఉన్నారు చంద్రబాబు.  ఆయన తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్‌లో ఉన్నప్పుడు చాలా అభివృద్ధి చేశారని.. దాని తర్వాత వచ్చిన గవర్నమెంట్లు కూడా అభివృద్ధి చేశాయని అన్నారు. ఆయన లోపల ఉండటం చాలా బాధాకరమన్నారు. బాబు పొలిటికల్ ప్రిసనర్ కాదని తెలిపారు. బాబు తొందరగా బయటికి రావాలని కోరుకుంటున్నానన్నారు. 

పాలిటిక్స్‌లో ఇది ఒక పెద్ద గుణపాఠమని పేర్కొన్నారు. తాను టైంను బాగా నమ్ముతానని.. బాబు టైం బాలేదని.. ఎవరు ఎంత ప్రయత్నించినా టైం బాగుంటే ఆయనే బయటికి వస్తారని చెప్పుకొచ్చారు. ఆయన తప్పకుండా బయటకు వస్తారని తెలిపారు. ‘‘మా స్టాఫ్ తప్పు చేసిన అది మా పైకే వస్తుంది అలాగే ఆయనకి తెలుసో తెలియకుండానే అది తప్పు జరిగి ఉండొచ్చు’’ అని అభిప్రాయపడ్డారు. ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేయడం మామూలు విషయం కాదు అన్ని ఆలోచించే చేసుంటారని సుమన్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news