ఎట్టకేలకు బయటపడ్డ సిద్ధార్థ – అతిధి బండారం..!

-

హీరో సిద్ధార్థ – అతిధిరావు హైదరి రిలేషన్ లో ఉన్నారన్న వార్తలు గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే వీటిని తిప్పి కొట్టే ప్రయత్నం చేశారు. కానీ తాజాగా జరిగిన సంఘటన మరొక సారి వీరిద్దరిని వివాదంలోకి లాగింది. ముంబైలో కలిసి చెక్కర్లు కొడుతూ ఈ జంట కెమెరా కంటికి చిక్కారు.. సిల్వర్ స్క్రీన్ లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్న సిద్ధార్థ రియల్ లైఫ్ లో మాత్రం అలాంటి వాడే.. ఇప్పటికే ఎంతోమంది అమ్మాయిలతో ప్రేమాయణం నడిపి.. ఆ తర్వాత బ్రేకప్ చేసుకున్నాడు. మొదట శృతిహాసన్ ఆ తర్వాత సమంతాలతో సిద్ధార్థ లవ్ ఎఫైర్స్ రచ్చకెక్కిన విషయం తెలిసిందే.

అనగనగా ఓ ధీరుడు సినిమాలో శృతిహాసన్, సిద్ధార్థ జతకట్టారు. ఈ సినిమా సెట్స్ లో ఆమెను లైన్ లో పెట్టిన సిద్ధార్థ కొన్నేళ్లపాటు ఆమెతో డేటింగ్ చేశారు. ఆ తర్వాత ఇద్దరికీ బోర్ కొట్టడంతో ఎలాంటి గొడవ లేకుండా విడిపోయారు. శృతి తో బ్రేకప్ చెప్పిన తర్వాత సమంతకు దగ్గరయ్యారు. నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత – సిద్దార్థ కలసి నటించిన చిత్రం జబర్దస్త్.. ఇక్కడే వీరి ప్రేమకు బీజం పడింది. రిలేషన్ లో నిజాయితీ లేని సిద్ధార్థ్ ఒక కన్నడ నటికి దగ్గరయ్యాడని తెలిసి.. సమంత దూరం అయింది.విడిపోయిన చాలాకాలం తర్వాత ఇప్పుడు మరికొన్ని ఎఫైర్స్ రూమర్స్ ఎదుర్కొంటున్నాడు.. హీరోయిన్ అతిధి రావు హైదరితో సిద్ధార్థ రిలేషన్ లో ఉన్నాడనేది ప్రస్తుత సమాచారం. గత కొద్దిరోజులుగా వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నారని కథనాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ముంబై హోటల్లో కనిపించడంతో ఈ వార్తలకు బలం చేకూరుతోంది.

ఇప్పటికే సిద్ధార్థ అతిధి రావ్ హైదరీలకు విడివిడిగా పెళ్లిళ్లు జరిగాయి. సిద్ధార్థ 2003లో మేఘన అనే అభిమానిని వివాహం చేసుకొని 2007లో విడాకులు ఇచ్చారు. అతిథి కూడా చిన్నవయసులోనే సత్యదేవ్ మిశ్రా అనే వ్యక్తిని రహస్య వివాహం చేసుకుంది. ఆ తర్వాత అతనితో విడాకులు తీసుకుంది. అయితే ఇలాంటి వీరిద్దరూ ఇప్పుడు కలిసి మళ్ళీ డేటింగ్ చేయడం సంచలనంగా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version