బూస్టర్ డోస్ పంపిణీ కి టీకాలు సరఫరా చేయండి – కేంద్రాన్ని కోరిన హరీష్ రావు

-

తెలంగాణ రాష్ట్రానికి కరోనా బూస్టర్ డోసులు సరఫరా చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు కేంద్రాన్ని కోరారు. కోవ్యాక్సిన్ 8 లక్షలు, కోవి షీల్డ్ 80 వేలు, ఉండగా కోర్బివాక్స్ డోసులు సున్నా ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో బూస్టర్ వేగవంతం చేసిందుకుగాను అవసరమైన వ్యాక్సిన్ లను రాష్ట్రానికి సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు. బూస్టర్ డోసు విషయంలో జాతీయ సగటు 23 శాతం ఉంటే తెలంగాణ సగటు 48 శాతంగా మెరుగైన స్థితిలో ఉందన్నారు. సీఎం కేసీఆర్ గారు నిత్య పర్యవేక్షణ, అప్రమత్తత చేయడం, ప్రజల్లో అవగాహన పెంచడం వల్ల ఇది సాధ్యమైందన్నారు.

కరోనా పరిస్థితులు రాష్ట్రాల సన్నద్ధతపై కేంద్ర వైద్యరోగ్య శాఖ మంత్రి మనసుక్ మాండవీయ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన వీడియో సమీక్షలో మంత్రి హరీశ్ రావు, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి పలు విజ్ఞప్తులు చేశారు. ప్రపంచ దేశాల్లో ఓమిక్రాన్ సబ్ వేరియంట్ బి ఎఫ్ 7 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, వైరస్ లక్షణాలు, వ్యాప్తి తీరు, ప్రభావం, చికిత్స వంటి అంశాల గురించి రాష్ట్రాలకు తెలియజేయాలని, ఈ అవగాహనతో మరింత అప్రమత్తంగా ఉండడం సాధ్యం అవుతుందని అన్నారు. గత అనుభవాల దృష్ట్యా ఆక్సిజన్ సరఫరాలో ఎలాంటి కొరత లేకుండా ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ఇందులో భాగంగా ఆక్సిజన్ ప్లాంట్స్ లను సమీప ఆసుపత్రులతో అనుసంధానం చేసేలా మ్యాపింగ్ చేసే విధానాన్ని తీసుకురావాలన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version