అమరావతి: ఏపీ ఆర్థిక శాఖకు సంబంధించిన లెక్కలపై టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ చేసిన ఆరోపణలపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పందించారు. రూ.41 వేల కోట్లకు పూర్తి లెక్కలున్నాయని ఆయన స్పష్టం చేశారు. బిల్లులు లేకుండా డబ్బులు చెల్లించామన్నది అవాస్తవమన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అనవసర అనుమానాలు రేకెత్తిస్తున్నారని బుగ్గన ఆరోపించారు. సీఎఫ్‌ఎంను ప్రవేశపెట్టింది టీడీపీ ప్రభుత్వమే అని గుర్తు చేశారు. ఆడిట్ సంస్థ ప్రశ్నల ఆధారంగా ఆరోపణలు చేస్తున్నారని బుగ్గన వ్యాఖ్యానించారు. ఏమైనా సందేహాలుంటే క్లారిటీ తీసుకోవచ్చని పయ్యావులకు మంత్రి బుగ్గన సూచించారు.
అయితే ఆ నిధుల్లో ఎలాంటి గోల్‌మాల్ జరగలేదని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్ వివరణ ఇచ్చారు. ఆ మొత్తాన్ని బడ్జెట్ ఖాతా నుంచి వివిధ కార్పొరేషన్ల పీడీ ఖాతాలకు మళ్లించి ఖర్చు చేసినట్టు తెలిపారు. దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ స్పందించి ఇప్పటికే జగన్ సర్కార్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చింది.