ట్యాక్స్ పేయ‌ర్ల‌కు గుడ్ న్యూస్‌.. ట్యాక్స్ రీఫండ్స్‌ను విడుద‌ల చేయ‌నున్న కేంద్రం..

-

కరోనా వైర‌స్ నేప‌థ్యంలో ప్ర‌జ‌లు ఓ వైపు భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌వుతున్న విష‌యం విదిత‌మే. అయితే కేంద్ర ప్ర‌భుత్వం మాత్రం ట్యాక్స్ పేయ‌ర్ల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. పెండింగ్‌లో ఉన్న రూ.5 ల‌క్ష‌ల వ‌ర‌కు  ఇన్‌క‌మ్‌ ట్యాక్స్ రీఫండ్స్‌ను త‌క్ష‌ణ‌మే విడుద‌ల చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. దీంతో 14 ల‌క్ష‌ల మంది ప‌న్ను చెల్లింపుదారుల‌కు ప్ర‌యోజ‌నం క‌ల‌గ‌నుంది. ఈ మేర‌కు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధ‌వారం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.

ఇక ఒక ల‌క్ష మంది వ్యాపారుల‌కు గాను రావ‌ల్సి ఉన్న పెండింగ్ జీఎస్‌టీ, క‌స్ట‌మ్ రీఫండ్స్‌ను కూడా విడుద‌ల చేస్తామ‌ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ క్ర‌మంలో ఆ మొత్తం రూ.18వేల కోట్ల వ‌ర‌కు ఉంటుంద‌ని ఆ శాఖ తెలియజేసింది. కాగా క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో కేంద్రం రూ.1.7 ల‌క్ష‌ల కోట్ల ఆర్థిక ప్యాకేజీని పేద‌ల‌కు ప్ర‌క‌టించ‌గా.. ఇప్పుడు ప‌న్ను చెల్లింపుదారుల‌కు తాజాగా తీసుకున్న నిర్ణ‌యం ప్ర‌యోజ‌నం క‌లిగించ‌నుంది.

కాగా క‌రోనా పేషెంట్ల‌కు చికిత్స‌నందిస్తున్న వైద్య సిబ్బందికి రూ.50 ల‌క్ష‌ల వ‌ర‌కు మెడిక‌ల్ ఇన్సూరెన్స్‌ను అందిస్తున్నామ‌ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ ఇది వ‌ర‌కే ప్ర‌క‌టించారు. ఈ క్ర‌మంలో ఒక్కో రంగానికి ఊత‌మిచ్చేందుకు ఇప్పుడు ఆ శాఖ దృష్టి సారించ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version