రేవతి కుటుంబానికి రూ.2కోట్ల ఆర్థిక సాయం : అల్లు అరవింద్

-

పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో ప్రదర్శన సందర్భంలో ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి మరణించిన విషయం విధితమే. అయితే రేవతి కుటుంబ సభ్యులను ఇప్పటికే సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి రూ.25లక్షలు ఆర్థిక సహాయం చేశారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజను పరామర్శించారు.

తాజాగా FDC చైర్మన్ దిల్ రాజు, నిర్మాత అల్లు అరవింద్ శ్రీతేజ ఆరోగ్యాన్ని పరామర్శించారు. పుష్ప-2 టీమ్ రూ.2కోట్లను ప్రకటించిందని నిర్మాత దిల్ రాజు వెల్లడించారు. అల్లు అర్జున్ రూ.కోటీ, సుకుమార్ రూ.50లక్షలు, మైత్రీ మూవీ మేకర్స్ నవీన్, రవిశంకర్  రూ.50 లక్షలు ఇస్తున్నట్టు వెల్లడించారు అల్లు అరవింద్. అలాగే వారి కుటుంబానికి సినీ ఇండస్ట్రీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version