తెలంగాణలో మాస్క్ పెట్టుకోకపోతే రూ.1000 ఫైన్ : డిహెచ్ శ్రీనివాసరావు

-

తెలంగాణలో కరోనా నిబంధనలు ఎత్తివేయలేదు…మాస్క్ ధరించకపోతే వెయ్యి రూపాయల జరిమాన పోలీసులు విధిస్తారని హెచ్చరించారు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అధికారి డిహెచ్ శ్రీనివాసరావు. చైనా, తైవాన్, ఈజిప్టు లో కేసులు పెరుగుతున్నాయి…ఢిల్లీ, హర్యానా, యూపీ లో కేసుల సంఖ్య పెరిగిందన్నారు.రాష్ట్రంలో నాలుగు నుంచి ఆరు వారాల్లో ఎలాంటి మార్పు లేదు…20 నుంచి 25 కేసులు మాత్రమే నమోదు అవుతున్నాయని వెల్లడించారు.

హైదరాబాద్ లో మాత్రమే 10 నుంచి 15 కేసులు నమోదు అవుతున్నాయి…ఫోర్త్ వేవ్ పై అనేక సందేహాలు కేంద్రం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేశాయన్నారు.థార్డ్ వేవ్ ను సమర్థవంతంగా ఎదుర్కొన్నాం…వేసవికాలంలో వేలాది శుభకార్యాలు ఉంటాయి. జాగ్రత్తలు అవసరం అని సూచించారు.

రాష్ట్రంలో పరిస్థితి అదుపులో ఉంది…ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరిస్తున్నామన్నరు.మాస్క్, సానిటైజేషన్ ఉపయోగించాలి. వ్యాక్సిన్ అందరూ తీసుకోవాలి. ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ 100% తీసుకున్నారు…60 సంవత్సరాల పైబడిన వారు బుస్టార్ డోస్ తీసుకోవాలని కోరారు.తెలంగాణలో ఆర్ వ్యాల్యూ .5% మాత్రమే. కానీ మాస్క్ ధరించాలి…ఫోర్త్ వేవ్ తెలంగాణలో రాదు. సిరో సర్వే ప్రకారం జనవరి 4వ తేదీన నిర్వహించారన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version