హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం

-

హైదరాబాద్ లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ లో షాపింగ్ కి ఫేమస్ అయిన అబిడ్స్ లోని చర్మాస్ లో ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం చర్మాస్ నాల్గవ అంతస్తులో మంటలు ఎగిసిపడుతున్నాయని చెబుతున్నారు. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడటంతో సిబ్బంది బయటకు పరుగులు తీసుకువచ్చారు.

అయితే ఈ ప్రమాదం షాట్ సర్క్యూట్ వల్ల సంభవించి ఉండవచ్చని భావిస్తున్నారు పోలీసులు. ఇక ఇప్పుడే అక్కడికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పటిదాకా ప్రాణ నష్టం అయితే ఏమీ లేదు కానీ భారీగా ఆస్తి నష్టం జరిగిందని ప్రాధమిక అంచనాకు వచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version