దేశంలో పెద్దఎత్తున ఆర్థిక నేరాలకు పాల్పడిన మొహుల్ చోక్సీ, నీరవ్ మోడీ, భుజ్ బల్ ప్రస్తుతం దేశం దాటి విదేశాల్లో సంచరిస్తున్నారు. ఇటీవల పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసిన చోక్సీని జర్మనీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
ఇదిలాఉండగా, వీరి కేసు ఫైల్స్ మొత్తం ముంబైలోని ఈడీ ఆఫీస్‌లోనే ఉన్నాయి. అయితే, ఈడీ ఆఫీస్ ఉన్న కైసర్-ఐ-హింద్ భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో పెద్దఎత్తున ఫైల్స్ కాలి బూడిదైనట్లు సమాచారం. మంటలు ఆర్పేందుకు 12 ఫైర్ ఇంజిన్లు రంగంలోకి దిగాయి. 10 గంటల పాటు మంటలు చెలరేగగా.. భారీగా ఆస్తినష్టం వాటిల్లినట్లు అధికారులు పేర్కొన్నారు.ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ.. చోక్సీ, నీరవ్, భుజ్‌బల్ తప్పించుకున్నట్టేనా? అని కొందరు నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.