ఏపీలో లిక్కర్ స్కామ్ ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.ఇప్పటికే ఈ కేసులో ఆరోపణల ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి, సజ్జల శ్రీధర్ మరికొందరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే లిక్కర్ స్కామ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది.
జస్టిస్ పార్థివాల,జస్టిస్ మహదేవన్ ధర్మాసనం విచారణ జరపగా.. విచారణకు హాజరైనట్లు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తరఫు న్యాయవాది అభిషేక్ సింగ్వి, నిరంజన్ రెడ్డిలు తెలిపారు. ఏపీ సీఐడీ దాఖలు చేసిన కౌంటర్‌ను పరిశీలించేందుకు సమయం కావాలని ఆయన తరపు లాయర్లు కోరారు. దీంతో తదుపరి విచారణను న్యాయమూర్తి 2 వారాలకు వాయిదా వేశారు. అప్పటివరకు ఎంపీని అరెస్టు చేయొద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు.