సూపర్‌మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం.. వస్తువులన్నీ అగ్నికి ఆహుతి..

-

నిజామాబాద్ పట్టణంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పట్టణంలోని ఆర్యనగర్‌లో ఉన్న టి మార్ట్ సూపర్ మార్కెట్‌లో ఆదివారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు క్రమంగా స్టోర్‌ మొత్తానికి వ్యాపించాయి. దీంతో ఆప్రాంతమంతా పొగలు కమ్ముకున్నాయి. దీంతో ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులుకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

అయితే.. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని దాదాపు 3 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియ రాలేదని పోలీసులు తెలిపారు. అగ్నిప్రమాదం వల్ల సుమారు రూ.2 కోట్ల విలువచేసే ఆస్తి నష్టం జరిగినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగానే మంటలు చెలరేగినట్లు అధికారులు భావిస్తున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version