షోరూంలో అగ్నిప్రమాదం.. 70కి ద్విచక్ర వాహనాలు దగ్ధం

-

శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భగవతి థియేటర్‌ రోడ్డులోని బైక్‌ షోరూం, హార్డ్‌వేర్‌ దుకాణంలో ఈ ఘటన జరిగింది. ఇవాళ తెల్లవారుజామున పొగలు రావడాన్ని గమనించిన స్థానికులు దుకాణ యజమానులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది స్థానికుల సాయంతో ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు మంటలను అదుపు చేశారు.

షార్ట్‌ సర్య్కూట్‌తోనే ప్రమాదం జరిగి ఉంటుందని అగ్నిమాపక అధికారులు అనుమానిస్తున్నారు. పాతవి, కొత్తవి కలిపి సుమారు 70కి పైగా ద్విచక్ర వాహనాలు పూర్తి దగ్ధమైనట్లు యజమానులు తెలిపారు. రెండు దుకాణాల మధ్యలో కేవలం ప్లైవుడ్‌ ఉండటంతో బైక్‌ షోరూం నుంచి వచ్చిన మంటలు హార్డ్‌ వేర్‌ దుకాణంలోకి వెళ్లాయి. అందులో పెయింట్స్‌ ఇతర సామగ్రికి మంటలు అంటుకోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ద్విచక్రవాహనాలు దగ్ధం అవ్వడంతో యజమాని ఆవేదన వ్యక్తం చేశాడు. కోట్లలో నష్టం వాటిల్లిందని వాపోయాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version