తెలంగాణ సరిహద్దుల్లో మరోసారి ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఛత్తీస్‌గఢ్ సరిహద్దును ఆనుకుని ఉన్న ప్రాంతంలో మరోసారి కాల్పుల మోత వినపడింది. వెంకటాపురం మండల పరిధిలోని కర్రిగుట్టపై బాంబుల అమర్చినట్లుగా లేఖ విడుదైన క్రమంలో అక్కడ సీఆర్‌పీఎఫ్ బలగాలు భారీ ఆపరేషన్ చేపట్టాయి.
ఛత్తీస్‌గఢ్ వైపు నుంచి సీఆర్‌పీఎఫ్ బలగాలు వరుసగా కాల్పులు జరుపుకుంటూ మావోయిస్టులను వెంటాడుతున్నారు.వారు వేగంగా కర్రిగుట్టవైపు కదులుతున్నట్లుగా సమాచారం.ఇదిలాఉండగా, నిన్న జార్ఖండ్‌లో జరిగిన ఎదురు కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు మృతి చెందగా..అందులో అగ్రనేతలు కూడా ఉన్నట్లు సమాచారం.