వాట్సాప్ లో డిలీట్ చేసిన మెసేజ్లను చదవాలి అనుకుంటే.. ఈ టెక్నిక్ ను ఉపయోగించండి..!

-

ఈ మధ్యకాలంలో సామాజిక మాధ్యమాలను చాలా శాతం మంది వినియోగిస్తున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించే సామాజిక మాధ్యమాలలో వాట్సాప్ కూడా ఒకటి. దీనిని ఎంతో ఎక్కువగా అందరూ ఉపయోగిస్తారు. పైగా రోజు రోజుకీ ఎన్నో కొత్త ఫీచర్లను కూడా అందిస్తున్నారు. ముఖ్యంగా ప్రైవసీకి సంబంధించిన ఫీచర్లు ఎంతో అవసరం. అయితే దీనికి సంబంధించి డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ అనే ఒక ఫీచర్ ను వాట్సాప్ ప్రవేశ పెట్టడం జరిగింది దీంతో పొరపాటున పంపించిన సందేశాలను డిలీట్ చేయవచ్చు. ఇలా చేసిన తర్వాత సందేశం అందిన వారు చదవలేరు. అయితే సందేశాలను తొలగించిన తర్వాత డిలీట్ చేసినటువంటి మెసేజ్ లను చూడడానికి కొన్ని థర్డ్ పార్టీ అప్లికేషన్లు అందుబాటులో ఉంటాయి.

అయితే చాలా శాతం మంది పొరపాటున పంపిన సందేశాన్ని డిలీట్ చేసినా సరే ఆ సందేశాన్ని చదవడానికి ఇటువంటి అప్లికేషన్ లను ఉపయోగిస్తూ ఉంటారు. కాకపోతే ఎలాంటి థర్డ్ పార్టీ అప్లికేషన్ లు లేకుండా డిలీట్ చేసిన సందేశాన్ని చదవవచ్చు. ఎప్పుడైతే థర్డ్ పార్టీ యాప్ లను ఉపయోగిస్తారో మీ సమాచారాన్ని వారు దొంగలించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ప్రైవసీకి సంబంధించిన సమస్యలు ఎంతో ఎక్కువగా ఉంటాయి. కనుక వాటిని ఉపయోగించకుండా ఈ ట్రిక్ ను పాటించండి. అయితే ఇది కేవలం ఆండ్రాయిడ్ 11 మరియు దాని తర్వాత వచ్చిన వెర్షన్ లకు మాత్రమే అందుబాటులో ఉంది. కనుక ముందుగా మీ ఫోన్ అప్డేట్ చేసి తర్వాత ప్రయత్నించండి.

ముందుగా ఫోన్ లో సెట్టింగ్స్ ఓపెన్ చేసి తర్వాత నోటిఫికేషన్ కు సంబంధించిన సెట్టింగ్స్ కి వెళ్ళాలి. ఇలా చేసిన తర్వాత నోటిఫికేషన్ హిస్టరీ ఓపెన్ చేయాలి. దీనిలో టోగుల్‌ అనే ఆప్షన్ ఉంటుంది, దీన్ని నొక్కిన తర్వాత గడిచిన 24 గంటల్లో మీ ఫోన్ కి వచ్చిన సందేశాలు అన్నిటిని చూడవచ్చు. ఈ సందేశాలలో డిలీట్ చేసినవి కూడా ఉంటాయి. కనుక నోటిఫికేషన్ హిస్టరీ ద్వారా డిలీట్ చేసిన సందేశాన్ని చూడవచ్చు. కాకపోతే దీనిలో ఫోటోలు, వీడియోలు లేక ఆడియోలకు సంబందించిన సందేశాలను చూడలేరు. కనుక ఈ టెక్నిక్ ని ఉపయోగించి డిలీట్ చేసిన సందేశాలను ఎటువంటి ప్రైవసీ భయం లేకుండా చూడవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news