LOC వెంట కాల్పులు.. భారత జవాన్ల కాల్పుల్లో నలుగురు పాక్ సైనికులు మృతి?

-

బోర్డర్‌లో సీజ్ ఫైర్ ఎత్తేయడంతో దాయాది పాక్ LOC వద్ద కాల్పులకు తెగబడుతోంది.ఇప్పటికే మూడు సార్లు కాల్పులకు తెగబడినట్లు సమాచారం. దీంతో భారత్-పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.మొత్తం మూడు ప్రాంతాల్లో పాక్ పోస్టుల నుంచి కాల్పులు జరిగినట్లు సమాచారం.శత్రు సైన్యానికి భారత ఆర్మీ గట్టిగా బదులిస్తోంది. ఈ ఘటనలో నలుగురు పాక్ సైనికులు మృతి చెందినట్లు సమాచారం.

సీజ్ ఫైర్ ఎత్తేయడంతో నియంత్రణ రేఖ వెంబడి భారత్‌పై పాక్ కాల్పులు జరుపుతుండగా.. పాక్ సైనికులు కాల్పులు మొదలుపెట్టారని భారత సైన్యం అంటోంది.అయితే వారికి సైన్యం సమర్థంగా బదులు ఇస్తోందని భారత సైనిక వర్గాలు వెల్లడించాయి.కాల్పుల విరమణ అమలులో లేని కారణంగా సరిహద్దు వెంబడి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news