లష్కరే తోయిబా కమాండర్ అల్తాఫ్ లల్లీ హతం అయ్యాడు. బందిపొరాలో నిర్వహించిన ఎన్ కౌంటర్‌లో లష్కరే తోయిబా కమాండర్ అల్తాఫ్ లల్లీను భారత ఆర్మీ మట్టుబెట్టింది. జమ్ముకాశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత జవాన్లు ఉగ్రవాదుల కోసం తీవ్రంగా గాలింపు చర్యలు మొదలెట్టారు.

ఈ క్రమంలోనే బందిపొరాలో సైన్యం, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే అల్తాఫ్ లల్లీని మట్టుబెట్టినట్లు సైన్యం ప్రకటించింది. ఇదిలాఉండగా, ఉగ్రదాడి జరిగిన మరుసటి రోజే ఎల్‌వోసీ క్రాస్ చేసేందుకు యత్నించిన ఇద్దరు తీవ్రవాదారులను భారత సైన్యం మట్టుబెట్టిన విషయం తెలిసిందే.