గుంటూరు జిల్లా మాచర్ల సాగర్ రింగ్ రోడ్డు కు చెందిన సత్యనారాయణ రాజు, విజయలక్ష్మి దంపతులు వాళ్ల కుమారుడు పత్తి గుడుపు కిరణ్ కుమార్ (32) కి చక్కటి వధువు ని వెతికి పెళ్లి చేశారు.శృంగారం అంటేనే భయపడే అతడికి స్నేహితులు ధైర్యం చెప్పారు.కుటుంబ సభ్యులు ఏమీ కాదని భరోసా ఇచ్చారు.ఈనెల 11న తెనాలికి చెందిన యువతితో వివాహం జరిగింది.12వ తేదీన భార్యను తీసుకొని మాచర్ల లోని తన ఇంటికి వెళ్ళాడు.నవ దంపతులు ఇద్దరికీ 16వ తేదీన వధువు ఇంట్లో ఫస్ట్ నైట్ కి ఏర్పాటు చేశారు.అదే రోజుతెనాలి వచ్చేందుకు నవ దంపతులు, వధువు కుటుంబ సభ్యులతో పయనమయ్యారు.సాయంత్రం నాలుగు గంటల సమయంలో గుంటూరులో బస్సు దిగగానే ఇప్పుడే వస్తానంటూ కిరణ్ వెళ్ళిపోయాడు.
రాత్రంతా బస్ స్టాండ్ లోనే వారు వేచి చూశారు.ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుండడంతో కిరణ్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.అయితే కృష్ణా నది ఎగువ ప్రాంతంలో కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం ఉందని తాడేపల్లి పోలీసులకు ఇటీవల సమాచారం అందింది.పోలీసులు వెళ్లి మృతదేహం వద్ద ఉన్న ఫోన్ లోని సిమ్మును స్వాధీనం చేసుకున్నారు.అందులోని కిరణ్ కుటుంబ సభ్యుల నెంబర్లకు సమాచారం అందించారు.కిరణ్ తల్లి వచ్చి, మృతదేహం తన కుమారుడిదేనని గుర్తించి బోరున విలపించింది.ఫస్ట్ నైట్ అంటే భయంతోనే ఇలా చేశాడని ఆమె తెలిపింది.దీంతో ఇరు కుటుంబాల లో విషాదం నెలకొంది.