Breaking : శ్రీహరి కోట నుంచి మొదటి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం జరిగింది. కాసేపటి క్రితమే.. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం(షార్) నుంచి రాకెట్ విక్రమ్-ఎస్ ని ప్రయోగించారు. దేశంలో తొలి ప్రైవేట్ రాకెట్ గా విక్రమ్-ఎస్ గుర్తింపు పొందింది.
భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాబాయి పేరుతో రాకెట్ కు విక్రమ్-ఎస్ గా నామకరణం చేశారు. శుక్రవారం 11.30 గంటలకు నింగిలోకి ఈ రాకేట్ ఎగిరింది. హైదరాబాద్ కు చెందిన స్టార్టప్ సంస్థ స్కైరూల్ ఏరోస్పేస్ ఈ ప్రయోగాన్ని ‘‘ప్రారంభ్’’పేరుతో నిర్వహించింది. విక్రమ్-ఎస్ ద్వారా మూడు పేలోడ్లను కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు.