కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి ఘన విజయం సాధించారు. హోరా హోరీగా సాగిన కౌంటింగ్ లో రెండో ప్రాధాన్యత ఓట్లతో అంజిరెడ్డి విజయాన్ని దక్కించుకున్నారు. కాసేపట్లో దీనిపై అధికారులు అధికారిక ప్రకటన చేయనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి రెండో స్థానంలో ఉండగా.. బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మూడో స్థానానికి పరిమితం అయ్యారు.
కౌంటింగ్ సెంటర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి బయటికి వెళ్లి పోయారు. కౌంటింగ్ తీరు సరిగ్గా లేదని కాంగ్రెస్ ఆరోపించింది. నరేందర్ రెడ్డి అభ్యంతరం పై ఎన్నికల అధికారులు క్లారిటీ ఇచ్చారు.