అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ తీసుకున్న చాలా నిర్ణయాలు ముందుగా హైలెట్ అయినాగానీ అమలులోకి వచ్చే సరికి అట్టర్ ఫ్లాప్ అయ్యేవి. ఎక్కువగా న్యాయస్థానం ముందు జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్ కాదు అంటూ గతంలో అనేక తీర్పులు రావడం జరిగాయి. ఇంగ్లీష్ మీడియం, రాజధాని అమరావతి, వైస్సార్సీపీ పార్టీ రంగుల విషయం ఇలా అనేక విషయాలలో కోర్టు చేత అక్షింతలు వేయించుకుంది. దాదాపు పది నెలల పరిపాలన కాలంలో ఏ ఒక్క అంశంలో కూడా జగన్ సర్కార్ కు న్యాయస్థానంలో ఊరట లభించలేదు. ఇటువంటి నేపథ్యంలో ఫస్ట్ టైం కోర్టులో గెలవాల్సిన టైం జగన్ కి వచ్చింది.
కరోనా వైరస్ అనే మహమ్మారి తో ప్రజలు పోరాడుతున్న టైములో రాజకీయాలు చేయటం ఈ టైంలో అవసరమా అని చాలామంది జగన్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించారు. ఇటువంటి పరిస్థితుల్లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోర్టుకు వెళ్లడంతో.. సోమవారం కోర్టు ముందుకు రాబోతున్న ఈ విషయంలో ఏం జరుగుతుందో అన్న ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో నెలకొంది. మరోపక్క కొత్త ఆర్డినెన్స్ తీసుకువచ్చిన దానిపై గవర్నర్ సంతకం పెట్టడం తో న్యాయస్థానం జగన్ తీసుకున్న నిర్ణయానికి ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అంటున్నారు.
అదే టైంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన కులం పై పై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను న్యాయస్థానం దృష్టికి తీసుకువస్తే… నిమ్మగడ్డకు న్యాయస్థానం అండగా ఉండే అవకాశం కూడా ఉందని మరొక వాదన వినబడుతోంది. మరి ఇటువంటి టైం లో అధికారంలో ఉన్న జగన్ ఈ విషయంలో జగన్ విసురుతున్న గవర్నర్ బాణం ఏ మేరకు పని చేస్తుందో చూడాలి. ఈ విషయంలో ఓడిపోతే మాత్రం జగన్ నిర్ణయాలకు ప్రభుత్వ వర్గాలలో విలువ ఉండదని చాలామంది అంటున్నారు.