అయోధ్య కి బయల్దేరిన మొదటి రైలు..!

-

అయోధ్యకి మొదటి రైలు బయలుదేరింది భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా జనవరి 22న అయోధ్యలోని బాలరాముడు విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరిగింది అప్పటినుండి కూడా అయోధ్యకి వెళ్ళాలని ప్రతి ఒక్కరూ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. 500 ఏళ్ల నాటి కల సహకారం కావడంతో ఈ కార్యక్రమాన్ని రామ భూమి ట్రస్ట్ ఎంతో మంది ప్రముఖులని ఇన్వైట్ చేసింది ప్రారంభోత్సవం నేపథ్యంలో కొంత కాలం పాటు నిర్మాణ పనులు నిలిపివేశారు ప్రస్తుతం అయోధ్యలో మిగతా ఆలయ నిర్మాణ పనులు పునః ప్రారంభించారు.

దేశవ్యాప్తంగా బాలరాముడు దర్శనం కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు తెలంగాణలోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి అయోధ్యకి ప్రయాణికులతో మొదటి రైలు బయలుదేరింది 1400 మంది ప్రయాణికులతో ఈ ట్రైన్ స్టార్ట్ అవ్వడం విశేషం అయోధ్యకి చేరుకునే రైలు కోసం రైల్వే శాఖ ప్రత్యేక ఏర్పాట్లని చేసింది అయోధ్య దర్శనం అయ్యాక తిరిగి ట్రైన్ తొమ్మిదన సికింద్రాబాద్కి రాబోతోంది.

Read more RELATED
Recommended to you

Latest news