కుమారి ఆంటీ కథ తో డాక్యుమెంటరీ.. నెట్ ఫ్లిక్స్ పోస్టర్ వైరల్..!

-

ఈ మధ్యకాలంలో కుమారి ఆంటీ ఎంత ఫేమస్ అయ్యారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు కుమారి ఆంటీ గురించి ఎక్కడ చూసినా చర్చ జోరుగా సాగుతోంది. పైగా ఎన్నో వీడియోలు కూడా కనబడుతున్నాయి సోషల్ మీడియా పుణ్యమా కుమారి ఆంటీ బాగా ఫేమస్ అయిపోయారు. కొంత మంది సినిమాల్లో ఆఫర్లు కూడా సోషల్ మీడియా ద్వారా కొట్టేసారు. ఇది ఇలా ఉంటే కుమారి ఆంటీ అలియాస్ సాయికుమారి హైదరాబాద్ లో రోడ్ సైడ్ ఫుడ్ బిజినెస్ చేస్తూ ఉంటారు.

ఆమె మీద సోషల్ మీడియా అంతా ఫోకస్ పెట్టేసింది. పైగా రీల్స్ కూడా ఆమె మీద విపరీతంగా కనబడుతున్నాయి కుమారి ఆంటీ బిగ్ బాస్ కి వెళ్తుందని కూడా వార్తలు వచ్చాయి. తాజాగా నెట్ ఫ్లిక్స్ కుమారి ఆంటీ స్టోరీ తో ఒక డాక్యుమెంటరీ విడుదల చేస్తున్నట్లు వార్త వైరల్ అవుతోంది. కొన్ని పోస్టర్స్ కూడా నెట్టింట సెన్సేషనల్ గా మారాయి అయితే ఇందులో నిజం ఎంత అనేది తెలీదు ఈ విషయంపై క్లారిటీ అయితే రావాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news