ఏపీలో మత్స్య విశ్వవిద్యాలయం.. కేబినెట్ గ్రీన్ సిగ్నల్

-

ఆంధ్రప్రదేశ్ లో మత్స్య విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసేందుకు అనుమతులు లభించాయి. పశ్చిమగోదావరి జిల్లాలో చైనా అకాడమీ సాంకేతిక సహకారంతో ఆనంద్ గ్రూప్‌ తో కలిసి పీపీపీ పద్ధతిలో ఏర్పాటుకు వీలుగా ఆర్డినెన్స్ కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రానున్న ఐదేళ్లలో రూ.300 కోట్ల వ్యయంతో యూనివర్సిటీని నిర్మించనున్నారు. ఇప్పటి దాకా దేశంలో ప్రత్యేకంగా 5 మాత్రమే ఫిషరీస్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. మత్స్య రంగంలో సమగ్ర అభివృద్ధి దిశగా ఏపీలో ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఈ నిర్ణయంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మంది ఆక్వా రంగంపై ఆధారపడిన రైతులకు ప్రయోజనం ఉంట్నుందని ప్రభుత్వం చెబుతోంది. నిపుణుల కొరత వల్ల ప్రతి ఏటా దాదాపు రూ.2,500 కోట్ల దాకా ఆక్వా రైతులు నష్టపోతున్నట్టు చెబుతున్నారు. ఈ యూనివర్సీటి ఏర్పాటు ద్వారా నష్టాన్ని సులువుగా అధిగమించవచ్చన్న భావనలో ప్రభుత్వం ఉంది. సాంకేతిక సెమినార్ల ద్వారా ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతుల సామర్థ్యంకు పెంపొందించే కార్యక్రమాలు చేపట్టేందుకు అవకాశం ఉందని భావిస్తున్నారు. నిజానికి ఈ ప్రాజెక్ట్ కి గత ప్రభుత్వమే 2017లో అనుమతులు ఇచ్చింది. కానీ ఎందుకో కానీ ఇప్పటికీ ముందడుగు పడలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version