ప్రముఖ టిక్‌ టాక్ స్టార్‌ కు మైనర్ల వల.. వీడియో తీసి మరీ!

-

తిరుపతి : ఓ ప్రముఖ టిక్ టాక్ స్టార్ మార్ఫింగ్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఐదుగురు వ్యక్తుల అరెస్టు అయ్యారు. బాధిత యువతి ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్టు చేశానే పోలీసులు. ఈ కేసులో అరవింద్, నాగరాజు, నరేష్ తో పాటు మరో ఇద్దరు మైనర్ బాలురు అరెస్ట్ అయ్యారు. యువతి ఫోటోలను, వీడియో లను మార్ఫింగ్ చేసి యూట్యూబ్ లో పోస్ట్ చేసి అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నారు ఈ యువకులు.

కేసు వివరాలపై మీడియాతో తిరుపతి అర్బన్ ఎస్పీ అప్పలనాయుడు మాట్లాడుతూ. సైబర్ టీం సాయంతో ఈ కేసును ఛేదించామని… కేవలం డబ్బుల కోసం మహిళల జీవితాలతో ఆడుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ముందు అమ్మాయిలు తగిన జాగ్రత్తలు పాటించాలని… బాధిత యువతులు నిర్భయంగా పోలీసులకు ఫిర్యాదు చేయండి, వారి వివరాలు గోప్యంగా ఉంచు తామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version