కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ ఎండీ పార్థసారధి అరెస్ట్

-

హైదరాబాద్‌ కార్వీ కన్సల్టెన్సీ ఎండీ పార్థసారధి ని క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన కేసు లో కార్వీ కన్సల్టెన్సీ ఎండీ పార్థసారధి ని అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు స్పష్టం చేశారు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని వాటిని చెల్లించక పోవడంతో బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మొత్తం రూ. 780 కోట్ల రుణాలను కార్వీ కన్సల్టెన్సీ ఎండీ పార్థసారధి తీసుకున్నారు. అలాగే.. రూ. 720 కోట్లు కస్టమర్ల నిధులను తారుమారు చేసినట్లు ఆరోపణలు కూడా వచ్చాయి. దీంతో ఎండీ పార్థ సార్థిని పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు. గత కొంత కాలం నుంచి కార్వీ కన్సల్టెన్సీ పై సెబీ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం… కార్వీ కన్సల్టెన్సీ ఎండీ పార్థసారధి పోలీసుల అదుపు లో ఉన్నారు. అసలు రుణాలు తీసుకుని ఏం చేశారు…? అసలు వాటితో ఏం చేశారు ? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version