బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దీని ఫలితంగా బుధవారం నుంచి శుక్రవారం వరకు ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా, రాయలసీమలో జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఇటీవల ఫెంగల్ తుఫాన్ ధాటికి ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే.
దాని ప్రభావం ఏపీలోని తీరప్రాంతాలతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. ఫెంగల్ తుఫాన్ అనంతరం బంగాళాఖాతంలో మరోసారి అల్పపీడనం ఏర్పడింది. ప్రస్తుతం అది స్థిరంగా కొనసాగుతోందని, దాని ప్రభావంతో ఏపీలోని కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీచేశారు.