ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ సేవింగ్ డేస్ సేల్‌.. ఫోన్ల‌పై త‌గ్గింపు ధ‌ర‌లు..!

-

ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఆగ‌స్టు 6 నుంచి బిగ్ సేవింగ్ డేస్ సేల్‌ను నిర్వ‌హిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఆ సేల్ 5 రోజుల పాటు కొన‌సాగ‌నుంది. ఆగ‌స్టు 10వ తేదీన సేల్ ముగుస్తుంది. ఇందులో భాగంగా ఐసీఐసీఐ, సిటీబ్యాంక్ కార్డుదారుల‌కు వ‌స్తువుల కొనుగోలుపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్ అందివ్వ‌నున్నారు. ఈ మేర‌కు ఫ్లిప్‌కార్ట్ స‌ద‌రు బ్యాంకుల‌తో ఒప్పందం చేసుకుంది.

సేల్‌లో భాగంగా ఆపిల్‌కు చెందిన ఐఫోన్ ఎక్స్ఆర్‌, ఒప్పో రెనో 2ఎఫ్‌, ఐఫోన్ ఎస్ఈ, రెడ్‌మీ కె20 ప్రొ త‌దిత‌ర ఫోన్ల‌ను చాలా త‌గ్గింపు ధ‌ర‌ల‌కు విక్ర‌యించ‌నున్నారు. మోటోరోలా ఫోల్డ‌బుల్ ఫోన్ మోటో రేజ‌ర్‌పై ఏకంగా రూ.20వేల భారీ డిస్కౌంట్‌ను ఇవ్వ‌నున్నారు. సేల్‌లో అందుబాటులో ఉండనున్న ప‌లు డీల్స్ వివ‌రాలు ఈ విధంగా ఉన్నాయి.

* ఐఫోన్ ఎక్స్ఆర్‌ను రూ.44,999 ధ‌ర‌కు కొనుగోలు చేయ‌వ‌చ్చు.
* ఒప్పో రెనో 2ఎఫ్‌ను రూ.17,990కి కొన‌వ‌చ్చు.
* ఐఫోన్ ఎస్ఈ 2020ని రూ.36,999కి కొన‌వ‌చ్చు.
* రెడ్‌మీ కె20 ప్రొ 6జీబీ ర్యామ్‌, 128జీబీ వేరియెంట్‌ను రూ.22,999 ధ‌ర‌కు కొన‌వ‌చ్చు.
* మోటోరోలా రేజ‌ర్ (2019)ను రూ.20వేల డిస్కౌంట్ అనంత‌రం రూ.1,24,999కి కొన‌వ‌చ్చు.

అలాగే ఒప్పో రెనో 10ఎక్స్ జూమ్‌, ఐఫోన్ 7 ప్ల‌స్‌, ఐక్యూ 3 ఫోన్ల‌పై కూడా ఉత్త‌మ‌మై డీల్స్ ఇవ్వ‌నున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version