అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ హత్య వ్యవహారం ఏ స్థాయిలో దుమారం రేపిందో అందరికి తెలిసిందే. ఈ వ్యవహారం అక్కడి ప్రజల్లో అమెరికా ప్రభుత్వం మీద అక్కడి పోలీస్ వ్యవస్థ మీద ఆగ్రహానికి కారణంగా మారింది. అమెరికాలో మమ్మల్ని బ్రతకనీయడం లేదు అంటూ నల్ల జాతి ప్రజలు దాదాపు పది రోజుల నుంచి తీవ్ర స్థాయిలో అమెరికా వీధుల్లో ఆందోళన చేస్తున్నారు. అమెరికా మొత్తం ఈ నిరసనలు జరుగుతూనే ఉన్నాయి.
ఇక ఇదిలా ఉంటే జార్జ్ ఫ్లాయిడ్ అంత్యక్రియలు అమెరికాలో జరిగాయి. 9 నిమిషాలపాటు మెడను నొక్కిపెట్టడంతో మరణించిన ఫ్లాయిడ్ అంత్యక్రియలను కుటుంబ సభ్యులు సన్నిహితులు పూర్తి చేసారు. జార్జ్ ఫ్లాయిడ్ మృతదేహాన్ని హ్యూస్టన్‌లోనే కుటుంబ సభ్యులు సన్నిహితులు సమాధి చేశారు. ఫ్లాయిడ్ తల్లి సమాధి పక్కనే ఫ్లాయిడ్ సమాధిని కుటుంబ సభ్యులు ఏర్పాటుచేశారు.
ఈ కార్యక్రమానికి అక్కడ భారీగా ప్రజలు హాజరయ్యారు. దీనితో పోలీసులు కూడా జాగ్రత్త చర్యలను తీసుకున్నారు. వేలాది మంది రావడంతో నిరసనలు జరగకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి సుమారు ఆరువేల మంది హాజరయ్యారని స్థానిక అధికారులు చెప్పారు. కాగా ఈ ఘటనలో నిందిత పోలీసు అధికారిని శాస్వతంగా అమెరికా సర్కార్ విధుల నుంచి తొలగించిన సంగతి తెలిసిందే.