భారత్ లో కరోనా తీవ్రత ప్రతీ రోజు కూడా పెరుగుతూ పోతుంది. కరోనా కట్టడికి ఎన్ని విధాలుగా చర్యలు తీసుకున్నా సరే కాశ్మీర్ నుంచి కాశీ వరకు తమిళనాడు నుంచి బెంగాల్ వరకు వేల కేసులు వందల మరణాలు నమోదు అవుతూనే ఉన్నాయి. కరోనా కట్టడి చర్యలు ఏ మాత్రం కూడా ఇప్పుడు దేశంలో ఫలించే అవకాశం కనపడటం లేదు అనే చెప్పాలి. ఇప్పుడు దేశంలో కరోనా కేసులు భయపెడుతున్నాయి.
దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో కరోనా పరిస్థితి ఇదే విధంగా ఉంది. ఇక ప్రజల్లో ఇప్పుడు భయం మొదలయింది అని అంటున్నారు. తమతో తిరిగే వారు కరోనా బారిన పడటంతో గమనిస్తున్నారు అని అందుకే ప్రజల్లో భయ౦ మొదలయింది అంటున్నారు. ముంబై లో ఢిల్లీ లో ఉన్న ఒక రెండు వీధుల్లో కరోనా తీవ్రత చాలా అధికంగా ఉంది. అక్కడ కరోనా తీవ్రత చూసి ప్రజలు ఇళ్ళ నుంచి బయటకు రావడం లేదు.
దేశంలో ఉన్న అన్ని నగరాలలో కూడా కరోనా ఉంది. ఇప్పుడు గ్రామాలకు కూడా కరోనా సోకుతుంది. దీనితో గ్రామాల్లో ఉన్న ప్రజలు కూడా బయటకు రావడానికి ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. కొంత మంది అయితే కరోనాకు భయపడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇన్ని రోజులు దాన్ని లైట్ తీసుకున్నా సరే ఇప్పుడు మాత్రం జనాలకు సినిమా కనపడుతుందని అందరూ కూడా అర్ధం చేసుకున్నారని అంటున్నారు. ఒకరకంగా చెప్పాలి అంటే మునిగిన తర్వాత దేశానికి చలి తెలిసింది అంటున్నారు.